ప్రభాస్ సినిమా కోసం హైదరాబాద్ కు దీపిక

ప్రభాస్ సినిమా కోసం హైదరాబాద్ కు దీపిక

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె హైదరాబాద్‌ చేరుకున్నారు. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్ లో రాబోతున్న ‘ప్రాజెక్ట్‌- కె’లో (వర్కింగ్‌ టైటిల్‌) ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీపికాకు సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్‌లో షూట్ చేయనున్నారు. శనివారం హైదరాబాద్ చేరుకున్న దీపికా లిలాక్‌పాంట్‌ సూట్‌, వైట్‌ క్రాప్‌ టాప్‌లో మెరిసింది. హిందీ పరిశ్రమలో తనదైన సత్తా చాటిన దీపికకు తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. బిగ్‌ బి అమితాబ్‌ ఇందులో కీకల పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది జులైలో గురు పూర్ణిమ సందర్భంగా అమితాబ్‌పై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ‘మహానటి’కి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన డాని శాంచెజ్-లోపెజ్.. ఈ మూవీకి పనిచేస్తుండగా.. మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సందర్భంగా వైజయంతీ మూవీస్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలుపుతో ఫొటోను షేర్ చేసింది.