డిగ్రీ దోస్త్ ఇంట్రా కాలేజీ ఫేజ్-2 షెడ్యూల్ విడుదల

డిగ్రీ దోస్త్ ఇంట్రా కాలేజీ ఫేజ్-2 షెడ్యూల్ విడుదల

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ (DOST) ప్రక్రియలో భాగంగా ఇంట్రా కాలేజీ స్లైడింగ్ (అదే కాలేజీలో కోర్సు/బ్రాంచ్ మార్పు) షెడ్యూల్ ను విడుదల చేసింది ఉన్నత విద్యా మండలి. 2026 ఆగస్టు 03వ తేదీన డిగ్రీ దోస్త్ ఇంట్రా కాలేజీ ఫేజ్ 2 షెడ్యూల్ ను విడుదల చేశారు  ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్ట రెడ్డి. 

ఆగస్టు 6 నుంచి11 వరకు స్పెషల్ డ్రైవ్ వెబ్ ఆప్షన్లు నిర్వహించనున్నారు. 12న  డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటుంది. 14న ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 14 నుంచి 18 వరకు  సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ఆగస్టు  20, 21  న ఇంట్రా కాలేజ్ ఫేజ్–2 సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. 

ఇంట్రా కాలేజీ స్లైడింగ్ ప్రకారం.. అదే కాలేజీలో కోర్సు లేదా గ్రూప్ మార్చుకోవడానికి ఈ స్లైడింగ్ ఉపయోగపడుతుంది. సంబంధిత కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉంటేనే మెరిట్, రిజర్వ్డ్ పద్ధతిలో సీట్లు కేటాయిస్తారు. సీటు రాకపోతే మునుపటి సీటు అలాగే ఉంటుందని తెలిపారు.