కోర్టు కేసులతో ఫలితాలు ఆలస్యం: TSPSC

కోర్టు కేసులతో ఫలితాలు ఆలస్యం: TSPSC

కోర్టు కేసుల కారణంగా టీచర్‌‌ రిక్రూట్‌‌ మెంట్ టెస్ట్‌‌(టీఆర్‌‌టీ) ఫైనల్ ఫలితాలు విడుదలలో ఆలస్యం అవుతోందని టీఎ స్‌‌పీఎస్సీ వెల్లడించింది. టీచర్ పోస్టుల భర్తీలో జాప్యం పై రెండ్రోజులుగా టీఆర్టీ అభ్యర్థులు ఆందోళనలు..హెచ్ ఆర్సీ లో ఫిర్యాదులు చేసిన మేరకు టీఎస్ పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ శుక్రవారం వివరణ ఇచ్చారు. 8,972 పోస్టులకు జరిపి న రాతపరీక్ష ర్యాంకులు, మార్కు ల వివరాలు కింద టేడాది జూన్‌‌లోనే విడుదల చేశామని గుర్తుచేశారు. 44 కేటగిరీల్లో 4,136 పోస్టుల నియామక ప్రక్రియ కూడా పూర్తి చేసినట్లు చెప్పారు. పలు కోర్టు కేసు నేపథ్యం లో ఎస్జీటీ తెలుగు మీడియం, పీఈటీ తెలుగు మీడియం, ఎస్‌‌ఏ హిందీ ,హిందీ లాంగ్వే జీ పండిట్‌‌ పోస్టులకు ఫలితాలు విడుదల చేయలేకపోయామని చెప్పారు. సాధ్యమైనంత త్వరలోనే టీఆర్‌‌టీ ఫలితాలు కూడా విడుదల చేస్తామన్నారు.