రహానె 2020 ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడనున్నాడు. ఐపీఎల్ ప్లేయర్స్ ట్రాన్స్ ఫర్ విండో గడువు గురువారం ముగియడంతో చివరి రోజు రాజస్థాన్ తమ మాజీ కెప్టెన్ రహానెతో పాటు బౌలింగ్ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ , పేసర్ ధవళ్ కులకర్ణిని వదులుకుంది. రూ.4 కోట్లకు కొనుగోలు చేసిన రహానెను ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇచ్చినరాయల్స్ .. అందుకు బదులుగా లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే,ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియాను తీసుకుంది. కృష్ణప్ప గౌతమ్ నుకింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు బదిలీ చేసింది. అయితే అందుకు బదులుగా వేరే వాళ్లను తీసుకోలేదు. అదే విధంగా పేసర్ ధవళ్ కులకర్ణిని ముంబై ఇండియన్స్ కు ట్రాన్స్ ఫర్ చేసింది. 2011 నుంచి 2015 వరకు, 2018, 19 సీజన్లలో రాయల్స్ కు ఆడిన రహానె రెండు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు చేశాడు. 24 మ్యాచ్ ల్లో కెప్టెన్ గా ఉన్నాడు.

