IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేయబోతుంది. ఇక ఈ మ్యాచులో భారీ స్కోర్ చేసేందుకు ఆర్సీబీ ప్లాన్ చేస్తుండగా, బెంగళూరుని తక్కువ స్కోరుకే కట్టడి చేయాలని ఢిల్లీ టీమ్ చూస్తుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. చిన్నస్వామి సాధారణంగా ఛేజింగ్‌కు అనుకూలించే మైదానం.. వికెట్ గట్టిగా ఉన్నప్పటికీ, ఎండ వల్ల ఆట సాగే కొద్దీ కొంచెం నెమ్మదించే అవకాశం ఉంది.. అందుకే మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన మాకు ఈ చిన్న విరామం బాగా ఉపయోగపడింది.. తిరిగి ఒక యూనిట్‌గా కలుసుకుని సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నాం.. ఇక మేము పాత జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని పటేల్ పేర్కొన్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. మేము కూడా మొదట బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం.. ఇది డే-గేమ్ కాబట్టి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్నాం.. బోర్డుపై భారీ స్కోరు ఉంచి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతాం.. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ప్రత్యేకమైన 'గ్రీన్ జెర్సీ' ధరిస్తోంది.. "సస్టైనబిలిటీ పట్ల మా నిబద్ధతను చాటిచెప్పేందుకే ఈ జెర్సీ ధరించామని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫైనల్ చిన్నస్వామిలోనే జరగనుంది.. కాబట్టి మా హోమ్ గ్రౌండ్‌లో జరిగే అన్ని మ్యాచ్‌లలో గెలవడం మాకు చాలా ముఖ్యం అని రజత్ పాటిదార్ వెల్లడించాడు.
ALSO READ : ఉప్పల్ లో SRH vs CSK మ్యాచ్... స్టేడియంలోకి వీటిని తీసుకెళ్లొద్దు...
తుదిజట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఔకిబ్ నబీ దార్, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్
ఇంపాక్ట్ ప్లేయర్స్: విప్రజ్ నిగమ్, అశుతోష్ శర్మ, కరుణ్ నాయర్, దుష్మంత చమీర, నితీష్ రాణా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్
ఇంపాక్ట్ ప్లేయర్స్: రసిఖ్ సలాం దార్, వెంకటేష్ అయ్యర్, జోర్డాన్ కాక్స్, , మంగేష్ యాదవ్, విక్కీ ఓస్ట్వాల్
🚨 TOSS 🚨@DelhiCapitals have won the toss and will bowl first against @RCBTweets
— IndianPremierLeague (@IPL) April 18, 2026
Updates ▶️ https://t.co/vfJ6SccA9T#TATAIPL | #KhelBindaas | #RCBvDC pic.twitter.com/u4tYnk5mUA

