V6 News

ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు..3 రాష్ట్రాల్లో నలుగురు అరెస్ట్

ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు..3 రాష్ట్రాల్లో నలుగురు అరెస్ట్

దేశవ్యాప్తంగా పేలుళ్లకు భారీ ఉగ్రకుట్రను  ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీస్ అరెస్టు చేశారు. టాయ్ కార్లలో ఐఈడీ అమర్చి బాంబు పేలుళ్లకు  పాల్పడేందుకు కుట్ర చేస్తున్నట్లు తెలిపారు. వీరంతా ఆన్ లైన్ ద్వారా తీవ్రవాదులచే ప్రేరేపించబడిన ఉగ్రవాద ముఠాగా  పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. 

దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్లాన్ చేస్తు్న్న ఉగ్రవాద ముఠాగా అనుమానిస్తున్న నలుగురు వ్యక్తులను శనివారం (ఏప్రిల్ 18) పోలీసులు అరెస్ట్ చేశారు.మహారాష్ట్ర, ఒడిశా, బీహార్ నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు.వీరంతా ఖారాసాన్ లష్కర్, ఖలీఫా రాజ్యస్థాపన వంటి కథనాలతో ప్రభావితులయ్యారని పోలీసులు చెబుతున్నారు. గజ్వాఏ హింద్ లో పాల్గొనేందుకు సిద్దమవుతున్నారని తెలిపారు. 

వీరంతా ఎన్ క్రిప్టెడ్ డిజిటల్ ప్లాట్ ఫాం ల ద్వారా ఇతరులను ఉగ్రవాదులుగా మార్చేందుకు యత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఐఈడీ తయారి పదార్థాలు, కమ్యూనికేషన్ పరికరాలు,  మొబైల్ ఫోన్లు డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. 

అరెస్టయిన నిందితుల్లో థానేకు చెందని మోసైబ్ అహ్మద్, ముంబైకి చెందిన మహ్మద్  హమ్మద్, భవనేశ్వర్ కు చెందిన షేక్ ఇమ్రాన్, బీహార్ లోని కతిహార్ కు చెందిన మహ్మద్ సోహైల్ గా గుర్తించారు.  పేలుళ్లకు కుట్ర,  రిక్రూట్ మెంట్స్, నిధులు సేకరణవంటి అంశాలపై ఈ ముఠా ఎన్ క్రిప్టెడ్ క్లోజ్డ్ సోషల్ మీడియా గ్రూపుల ద్వారా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు క్యూఆర్ కోడ్లు, బ్యాంకు ఖాతాల ద్వారా క్రౌడ్ ఫండిం గ్ కు కూడా ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

ముఠాలోని  సభ్యులు కొందరు ఐఈడీ తయారికి సామాగ్రి సేకరణ,  మరికొందరు నియామకాలు, ఇంకొందరు శిక్షణ ప్రణాళికలు, ప్రచారంపై దృష్టి సారించినట్లు దర్యాప్తులో తేలింది. డిసెంబర్ 2025లో నిందితులలో ఒకరు ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్, ఇండియా గేట్‌తో సహా పలు కీలక ప్రదేశాలలో రెక్కీ నిర్వహించినట్లు భావిస్తున్నారు. నిందితులు ఆన్‌లైన్ భావజాల కంటెంట్ ,జాకిర్ నాయక్‌తో సహా పలువురి మత ప్రసంగాల ప్రభావితులైనట్లు తేలిందని పోలీసులు తెలిపారు.