లాక్ డౌన్ ముగిసే సమయం ఆసన్నమైంది.. కార్మికులు ఎక్కడికి వెళ్లొద్దు

లాక్ డౌన్ ముగిసే సమయం ఆసన్నమైంది.. కార్మికులు ఎక్కడికి వెళ్లొద్దు

త్వరలో లాక్ డౌన్ ఎత్తేస్తామని , స్వగ్రామాలకు వెళ్లే కార్మికులు ఎక్కడికి వెళ్లొద్దని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. కరోనా వైరస్ పై మీడియాతో మాట్లాడిన ఆయన..వలస కార్మికులు రాజధాని ఢిల్లీని విడిచి ఎక్కడికి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్  త్వరలో ముగుస్తుంది. పూర్వ వైభవం వస్తుంది. పనులు చేసుకోవచ్చన్నారు.

ఇక తమ సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్లే కార్మికులకు ప్రత్యేకంగా రైళ్లను ఏర్పాటు చేస్తామని, కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.  అందరూ ఢిల్లీలో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దేశ రాజధానిని వదిలి వెళ్లడం మీకు మరియు మీ కుటుంబానికి చాలా ప్రమాదకరం అని అన్నారు.

ప్రజలు నిలువనీడలేక, తిండిలేకుండా రోజులు తరబడి రోడ్లపై నడవడం నన్ను ఎంతగానో బాధించింది. కరోనా విషయంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అనిపిస్తుంది. అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే కార్మికులకు అన్నీ ఏర్పాట్లు చేస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు.