మహిళల కోసం కేంద్ర ప్రభుత్వ సేవింగ్ స్కీం..తక్కువ టైంలో ఎక్కువ వడ్డీ

మహిళల కోసం కేంద్ర ప్రభుత్వ సేవింగ్ స్కీం..తక్కువ టైంలో ఎక్కువ వడ్డీ

ప్రజాసంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది.పేదలు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, వృద్ధులకు అనేక స్కీంలతో వారి బలోపేతానికి కృషి చేస్తుంది. ఇటీవల బడ్జెట్ లో మహిళలకోసం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది కేంద్రం ప్రభుత్వం. అదే మహిళా సమ్మాన్  సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం. ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

మహిళలకు వెన్నుదన్నుగా ఉంటూ వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పలు సేవింగ్స్ స్కీంలను తెచ్చింది. వాటిలో ఒకటి మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీం. ఈ పథకం ద్వారా మహిళలను పొదుపు వైపు మళ్లించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బడ్జెట్ 2023-24 లో ఈ ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చారు. 

2023 ఏప్రిల్ 1 ఈ స్కీం ను ప్రారంభించారు. ఈ పథకం కింద ఖాతా ప్రారంభిస్తే తక్కువ కాలంలో ఎక్కువ వడ్డీ ఇస్తారు. దీని కాల వ్యవధి కేవలం రెండేళ్లు మాత్రమే.ఇది స్వల్పకాలిక ఫిక్స్ డ్ డిపాజిట్ లాంటిదని చెప్పవచ్చు. మార్చి2025  వరకు దీనిలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. 

మహిళలు ఎవరైనా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ భాగస్వామ్యంలోని ప్రైవేట్ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మహిళలు ఈ ఎంఎస్ ఎస్సీ ఖాతాను ఓపెన్ చేయొచ్చు. ఏ వయసు వాళ్లయిన ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. ఒకవేళ మైనర బాలిక అయితే చట్టబద్దమైన సంరక్షుని పేరు మీద ఖాతా తెరవచ్చు. 

ఈ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ అకౌంట్ లో తక్కువల తక్కువ రూ.1,000 నుంచి రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పెట్టుబడిపై ఏటా 7.5 శాతం వడ్డీ వస్తుంది. ఈ వార్షిక వడ్డీని ప్రతి త్రైమాసికం తర్వాత ఖాతాలో డిపాజిట్ చేస్తారు. 

పెట్టుబడి పెట్టిన సంవత్సరంలో మీ బ్యాలెన్స్ లో 40 శాతం వరకు తీసుకోవచ్చు. అదేవిధంగా పథకం మెచ్యూరిటీ తర్వాత ఫారం -2 పూర్తి చేసి అకౌంట్ లోని మొత్తం డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. 
ఉదాహరణకు ఈ స్కీంలో రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే ఎంతొస్తుంది చూద్దాం. 2 లక్షల పెట్టుబడికి మొదటి త్రైమాసికానికి వడ్డీ రూ. 3,750 అవుతుంది. ఇది ప్రతి త్రైమాసికంలో రిపీట్ అవుతుంది. కాలపరిమితి రెండేళ్లు ముగిసే సమయానికి మెచ్యూరిటీ విలువ రూ. 2 లక్షల 32 వేలకు చేరుతుంది.