ఢిల్లీలో హై అలర్ట్..నలుగురు అరెస్ట్

ఢిల్లీలో హై అలర్ట్..నలుగురు  అరెస్ట్

ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్‌ ప్రకటించారు అధికారులు. ఎర్రకోట సహా పలు ప్రముఖ ప్రాంతాల్లో భద్రతను పెంచారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ముందు ఢిల్లీ పోలీసులు భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకుని, నలుగురు అనుమానితులను అరెస్టు చేశారు.

పంద్రాగస్టు క్రమంలో ఉగ్ర దాడులు, హింసాత్మక ఘటనలు జరగొచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో ఢిల్లీ పోలీసులు అలర్టయ్యారు. ఢిల్లీలో విస్తృత తనిఖీలు చేపట్టిన ప్రత్యేక బ్రాంచ్‌ పోలీసులు భారీ కుట్రను భగ్నం చేశారు. నలుగురు అనుమానితులను అరెస్టు చేసి వారి నుంచి 55 పిస్టళ్లు, 50 బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వ్యక్తులను రాజ్‌వీర్ ధీరజ్ (హత్రాస్), వినోద్ (ఫిరోజాబాద్, యూపీ), ధర్మేంద్ర భరతాల్ (ఢిల్లీ)గా గుర్తించారు. సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రోన్లు, బెలూన్లు వంటివి ఎగరవేయడంపై పోలీసులు నిషేధం విధించారు.