ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ సడలింపు

ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ సడలింపు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలను రీ ఓపెన్ చేయాలని కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయించింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో పాఠశాలల పున:ప్రారంభించాలని  ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ ఇన్ స్టిట్యూట్ లు ఓపెన్ చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, స్పాలను వచ్చే వారం నుంచి తెరవాలని నిర్ణయించింది. నైట్ కర్ఫ్యూను కూడా ఒక గంట సడలించింది. తొలుత రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగేది. ఇప్పుడు దాన్నిరాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈనెల 7 న 9 నుంచి 12 తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. పాఠశాలలు దశల వారీగా తెరుచుకుంటాయని చెప్పారు. టీచర్స్ అందరూ కోవిడ్ టీకాలు తీసుకునే విధులకు హాజరవుతారన్నారు. ఇక కార్యాలయాలు వంద శాతం హాజరుతో పనిచేయవచ్చు అన్నారు. కోవిడ్ రూల్స్ పాటించేలా  ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు కూడా తగ్గిందన్నారు. 

మరిన్ని వార్తల కోసం

మేకిన్ ఇండియా కాదు.. బై ఫ్రమ్ చైనా

రాజ్యసభ నుంచి తమిళనాడు ఎంపీల వాకౌట్