రాజ్యసభ నుంచి తమిళనాడు ఎంపీల వాకౌట్

రాజ్యసభ నుంచి తమిళనాడు ఎంపీల వాకౌట్

రాజ్యసభలో తమిళనాడు ఎంపీలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ ఆమోదించిన నీట్ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంపై రాజ్యసభలో చర్చకు పట్టుబట్టారు ఎంపీలు. అయితే.. జీరో అవర్ కొనసాగుతున్నందున...ఇష్యూను టేకప్ చేయలేనని తేల్చి చెప్పారు చైర్మన్ వెంకయ్యనాయుడు. అయినా సభ్యులు వెనక్కి తగ్గలేదు. పోడియం దగ్గరకు వెళ్లి నిరసన తెలపడంతో వారిపై సీరియస్ అయ్యారు వెంకయ్యనాయుడు. దాంతో ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.

తమిళనాడు గవర్నర్.. ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ. నీట్ బిల్లును కేంద్రానికి పంపాలని సీఎం స్టాలిన్.. రెండు సార్లు గవర్నర్ ను కలిసినా పట్టించుకోలేదన్నారు. దీనిని రాజ్యసభలో ప్రస్తావిస్తే.. తమకు అనుమతి ఇవ్వలేదన్నారు శివ. అందుకే తాము సభ నుంచి వాకౌట్ చేశామని చెప్పారు.