చివరి క్షణాల్లో ఉన్న తాతను చూసేందుకు వచ్చి.. కుటుంబం మొత్తం మంటల్లో సజీవదహనం

చివరి క్షణాల్లో ఉన్న తాతను చూసేందుకు వచ్చి.. కుటుంబం మొత్తం మంటల్లో సజీవదహనం

అత్యంత విషాదకర ఘటన..చివరి క్షణాల్లో ఉన్న ఇంటి పెద్దను చూసేందుకు వచ్చిన కుటుంబం.. ఆస్పత్రిలో అతన్ని పరామర్శించారు. కొన్ని రోజులు ఆయనతో గడాలనుకున్నారు. ఆ హోటల్ లో దిగారు.. అయితే ఆ హోటలే తమ పాలిట యమ లోకం అవుతుందని వారు ఊహించలేదు.. ఢిల్లీ హోటల్ అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8మంది మంటల్లో కాలిబూడిదైన ఘటన అందరిని కలచివేస్తోంది. 

75ఏళ్ల రాథే శ్యామ్ అగర్వాల్.. వృద్యాప్య అనారోగ్యం కారణంగా  ఢిల్లీలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వేర్వేరు ప్రాంతాల్లో తన కుటుంబ సభ్యులను చూడాలనుకున్నాడు.. వారితో గడపాలనుకున్నాడు. చివరి క్షణాల్లో ఉన్నాను.. మిమ్మల్ని చూడాలని ఉందని ఫోన్ చేసి రమ్మన్నాడు. పెద్దాయన కోరిక మేరకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న కుటుంబ సభ్యులంతా హుటాహుటిన ఢిల్లీకి వచ్చారు.  ఆస్పత్రి సమీపంలోని  ఫ్లోరిష్ స్టే హోటల్‌ లో దిగారు అదేవారి పాలిట మృత్యు గుహ అయింది. 

బుధవారం(జూన్3) ఢిల్లీలోని హౌజ్ రాణి ప్రాంతంలో ఫ్లోరిష్ స్టే హోటల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో రాథే శ్యామ్ అగర్వాల్ కుటుంబం మొత్తం మంటల్లో సజీవదహనమయ్యారు. రాథేశ్యామ్ భార్య, కొడుకు, కోడలు, మనమలు, మనమరాళ్లు, బంధువులు సహా  మొత్తం 8మంది మంటల్లో కాలి బూడిదయ్యారు. 

గత కొన్ని రోజులుగా ఢిల్లీ హౌజ్ రాణి ప్రాంతంలోని మాక్స్ ఆస్పత్రిలో రాథే శ్యామ్ అగర్వాల్ చికిత్స పొందుతున్నాడు. తండ్రిని పరామర్శించేందుకు వచ్చిన అతని కుమారుడు అగ్నిప్రమాదం జరిగిన మాల్వీయ నగర్‌లోని ఫ్లోరిష్ స్టే హోటల్ లో రెండు గదులను బుక్ చేసుకున్నాడు. అందులో తన తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు, మరో ముగ్గురు బంధువులు దిగారు. వీళ్లంతా ప్రమాదంలో చనిపోయారు. 
 
సమీపంలోని ఆసుపత్రిలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు చికిత్స పొందుతున్న 75 ఏళ్ల రాధే శ్యామ్ అగర్వాల్‌కు మద్దతుగా అగర్వాల్ కుటుంబ సభ్యులు ఢిల్లీలో సమావేశమయ్యారు. బుధవారం మధ్యాహ్నానికి, విదేశీయులతో సహా 21 మంది మరణించిన ఘోరమైన మాల్వీయా నగర్ హోటల్ అగ్నిప్రమాదంలో ఆ కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించారు.  ఈ ప్రమాదంలో వివేక్ (48), అతని భార్య తర్జిన(47), తల్లి ప్రేమలతా, కుమార్తెలు జివిసా, వారియాలు  ప్రాణాలు కోల్పోవడం గురుగ్రామ్ లోని రాథేశ్యామ్ అగర్వాల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కాలనీవాసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 


అగర్వాల్ కుటుంబం మొత్తం ప్రమాదంలో చనిపోయిదన్న వార్తను నమ్మలేకపోతున్నాం.వివేక్ అగర్వాల్ చాలా మంచి వ్యక్తి, ఆ కుటుంబం కాలనీవాసులతో ఎంతో స్నేహంగా ఉండేది అని కాలనీ వాసులు విచారం వ్యక్తం చేశారు. 

బహుశా నేను బ్రతకలేనేమో.. బంధువుకు ఫోన్ చేసి..

వివేక్ బంధువైన పునీత్ గుప్తా మాట్లాడుతూ..మంటల మధ్యలో అతను తనకు ఫోన్ చేసి,  అన్నా బహుశా మేం బతికి ఉండకపోవచ్చు అని చెప్పడంతో తల్లడిల్లి పోయానన్నారు. కర్చిఫ్ తడిప ముఖంపై కప్పుకోమని చెప్పాను.. కానీ దాని వల్ల ప్రయోజనం లేకపోయింది.. మేం అక్కడికి చేరుకునే లోపే వివేక్ కుటుంబం మంటల్లో చిక్కుకుని చనిపోయారని  బోరున ఏడ్చారు. 

ప్రమాదంలో మరణించిన వారిలో  రాజస్థాన్ కు చెందిన వివేక్ మేనమామ, మేనత్త, మరో బంధువుకు కూడా ఉండటం ఆ కుటుంబం జీర్ణించుకోలేని విషయం.మృతుల్లో అందరికన్నా చిన్న  వయస్కురాలు వివేక్ కుమార్తె జివిస. ఆస్పత్రిలో ఉన్న తాతను పరామర్శించడానికి ఒక రోజు ముందే బెంగళూరు నుంచి వచ్చింది. మరికొద్ది గంటల్లో తిరిగి బెంగళూరుకు వెళ్లాల్సి ఉండగా  ప్రమాదంలో చనిపోయింది.  

ఎనిమిది మంది కుటుంబ సభ్యులు మృతిచెందడంతో ఇప్పుడు ఆ కుటుంబంలో మిగిలిన ఏకైక వ్యక్తి అనారోగ్యంతో ఉన్న వివేక్ తండ్రి రాధే శ్యామ్ అగర్వాల్ మాత్రమే. ఆయనకు ఈ విషాదం గురించి ఇంకా తెలియజేయలేదని సమాచారం.