గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య

గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య
  • వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్​

చిట్యాల, వెలుగు: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య డిమాండ్ చేశారు. గురువారం చిట్యాలలో మేకల లింగయ్య భవన్‌‌‌‌లో కల్లూరు కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వంట గ్యాస్ సిలిండర్‌‌‌‌పై రూ.60, వాణిజ్య గ్యాస్ సిలిండర్‌‌‌‌పై రూ.116 పెంచి కేంద్రం ప్రజలపై భారీ భారం మోపుతోందన్నారు.

చమురు దిగుమతుల్లో ఏర్పడుతున్న అంతరాయాలు, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో గ్యాస్ ధరలు పెంచడం అన్యాయమన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరంతరం పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతోందని ఆరోపించారు. ధరలను తగ్గించే వరకు పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి, మండల కార్యదర్శి మెట్టు పరమేశ్, నాయకులు జిట్ట నగేశ్, అవిశెట్టి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.