బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌‌‌‌కు రూ.31 కోట్లు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌‌‌‌కు రూ.31 కోట్లు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా అమలవుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి నిధుల కొరత లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. పరిషత్‌‌‌‌కు బకాయి ఉన్న రూ.6 కోట్ల పెండింగ్ నిధులతో పాటు, ఇప్పటికే పరిపాలనా ఆమోదం పొందిన రూ.25 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ఐటీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సెక్రటేరియెట్‌‌‌‌లో డిప్యూటీ సీఎంను ప్రత్యేకంగా కలసి వినతిపత్రం సమర్పించింది. పరిషత్ ద్వారా నిర్వహించే సంక్షేమ పథకాలు, పేద బ్రాహ్మణులకు అందించే సహాయ కార్యక్రమాలకు నిధుల అవసరాన్ని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మొత్తం రూ.31 కోట్ల నిధులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదల ప్రక్రియ పూర్తి చేయాలని  ఆదేశాలిచ్చారు.