నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని చెరువులో భారీగా డెవిల్ ఫిష్‌లు పెరిగిపోతున్నాయి. కాల్వ ద్వారా ఈ ఫిష్‌లు చెరువులోకి చేరి, ఇతర చేపలను తినేస్తున్నాయని మత్స్యకారులు వాపోయారు.
మత్స్యకారులు చేపల వేటలో భాగంగా సోమవారం వలలు వేయగా సుమారు ఐదు టన్నులకు పైగా డెవిల్ ఫిష్‌లు బయటపడ్డాయి. వీటి వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, అధికారులు వాటిని తొలగించాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు. – చిట్యాల, వెలుగు
