అది జీఎన్ రావు కమిటీ కాదు జగన్ మోహన్ కమిటీ

అది జీఎన్ రావు కమిటీ కాదు జగన్ మోహన్ కమిటీ

రాజధాని పేరుతో విశాఖలో రియల్ ఎస్టేట్ కు తెరలేపారన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమ.అది  జిఎన్ రావు కమిటీ కాదని.. జగన్ మోహన్ కమిటీ అని అన్నారు. రైతుల ఆందోళన చూసి జిఎన్ రావు కూడా దొడ్డి దారిన పారిపోయారన్నారు. జగన్ పుట్టిన రోజు కానుకగా ప్రజల గుండెల మీద తన్నాడన్నారు.  తుళ్లూరులో వరదలు వస్తాయా.? జిఎన్ రావు కమిటీకి బుర్ర ఉందా? అని అన్నారు.

విశాఖలో చాలా భూములు వైసీపీ నేతలు కొనుగోలు చేశారని అన్నారు. లంకెలపాలెం ఏరియాలో దళారీలును పెట్టి వేల ఎకరాలు కొనుగోలు చేశారన్నారు.వాల్తేర్ క్లబ్ దగ్గరలో  సాయిరెడ్డి 13 ఎకరాలు కబ్జా చేసాడన్నారు.భోగాపురం  నుండి మధురవాడ వరకు 6000 ఎకరాల భూమి చేతులు మారిందన్నారు. ప్రభుత్వం మెడలు వంచి రాజధానిని కాపాడుకుంటామన్నారు.