Sikandar: సల్మాన్ జంటగా రష్మిక.. స్వయంగా ప్రకటించిన నేషనల్ క్రష్

Sikandar: సల్మాన్ జంటగా రష్మిక.. స్వయంగా ప్రకటించిన నేషనల్ క్రష్

యానిమల్(Animal) సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna). బాలీవుడ్ లో ఆమె చేసిన మొదటి సినిమానే భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. లేటెస్ట్ బాలీవుడ్ నుండి మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది ఈ కన్నడ చిన్నది. అవును.. తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్(AR murugadass) బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan) తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 

పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సికందర్(Sikandar) అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ప్రస్తుతం మేకింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2025 ఈద్ కి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవల ప్రకటించాడు హీరో సల్మాన్ ఖాన్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ను ఫిక్స్ చేశారట మేకర్స్. ఇదే విషయాన్నీ స్వయంగా రశ్మికనే సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ తో పంచుకుంది.

కొంతకాలంగా చాలా మంది నా నెక్స్ట్ సినిమా గురించి అడుగుతున్నారు. నేను ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సికందర్ సినిమాలో నటిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన చిత్ర యూనిట్ కి చాలా థాంక్స్.. అంటూ తెలిపింది రష్మిక. ప్రస్తుతం ఆమె చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి యానిమల్ లాంటి సూపర్ హిట్ తరువాత మరో క్రేజీ ప్రాజెక్టు తో వస్తున్న రష్మిక ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.