Game Changer: మరింత ఆలస్యం కానున్న గేమ్ ఛేంజర్ రిలీజ్.. కారణం ఏంటంటే?

Game Changer: మరింత ఆలస్యం కానున్న గేమ్ ఛేంజర్ రిలీజ్.. కారణం ఏంటంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ సక్సెస్ తరువాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో అవుతోంది. కానీ, ఒక విషయంలో మాత్రం మెగా చాలా డిజప్పాయింట్ లో ఉన్నారు. 

ఎందుకంటే.. గేమ్ ఛేంజర్ సినిమాపై మొదలై దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలపై ఎలాంటి స్పష్టత రావడం లేదు. ముందుగా ఈ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, కుదరలేదు. ఆ తరువాత సమ్మర్ అన్నారు.. అది కాస్త సెప్టెంబర్ కి మారింది. అయినప్పటికి.. మెగా ఫ్యాన్స్ కాస్త హ్యాపీ ఫీలయ్యారు. కానీ, ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు గేమ్ ఛేంజర్ విడుదల మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. అవును.. ఈ సినిమాను డిసెంబర్ కు పోస్ట్ పోనే చేయనున్నారట మేకర్స్. 

అయితే.. గేమ్ ఛేంజర్ విడుదల ఆలస్యానికి కారణం దర్శకుడు శంకర్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ తో ఇండియన్ 2(భారతీయుడు 2) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే.. ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా ఇండియన్ 2పై పెట్టారట. ప్రమోషన్స్ కూడా త్వరలో మొదలుకానున్నాయి. అందుకే.. గేమ్ ఛేంజర్ షూట్ కి కొన్నిరోజులు బ్రేక్ ఇవ్వనున్నాడట శంకర్. ఆ కారణంగా రామ్ చరణ్ సినిమా విడుదల మరింత ఆలస్యం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి డిసెంబర్ లో అయినా ఈ సినిమా విడుదల ఉంటుందా? లేక మళ్ళీ వాయిదా వేస్తారా అనేది చూడాలి.