ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతీ ఓటరు బాధ్యత : ​రిజ్వాన్​ బాషా షేక్

ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతీ ఓటరు బాధ్యత : ​రిజ్వాన్​ బాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: ఓటు హక్కు వినియోగించుకోవడం, వినియోగించుకునేలా అవగాహన కల్పించడం ప్రతీ ఒక్క ఓటరు బాధ్యతగా తీసుకోవాలని జిల్లా ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్​రిజ్వాన్​ బాషా షేక్ కోరారు. బుధవారం కలెక్టరేట్ లో ఓటు హక్కు వినియోగంపై స్వీప్​ కార్యక్రమాల్లో భాగంగా డీఆర్డీవో ఆధ్వర్యంలో మహిళా సంఘాలతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఈసీ ఆదేశాల మేరకు ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 అనంతరం పోలింగ్ విధానం, సమయం నిర్వహించే తేదీలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్, జడ్పీ సీఈవో అనిల్ కుమార్, డీఆర్డీవో మొగులప్ప,   స్వీప్ నోడల్ ఆఫీసర్ వినోద్​కుమార్, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచామని, సంబంధిత ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ రిజ్వాన్​బాషా షేక్ పేర్కొన్నారు.