ఆధ్యాత్మికం.. ప్రాణం అంటే ఏమిటి.. అది ఎలా జన్మిస్తుంది..

ఆధ్యాత్మికం.. ప్రాణం అంటే ఏమిటి.. అది ఎలా జన్మిస్తుంది..

ప్రాణం  సమస్త జీవులను నిలబెట్టే జీవశక్తి .  శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు  ఆధ్యాత్మికను ప్రభావితం చేస్తుంది.ప్రాణాన్ని అర్థం చేసుకుంటే వలన మెరుగైన శ్రేయస్సు,  జీవితంలో సామరస్యపూర్ణమైన సమతుల్యత ఏర్పడతాయి.ప్రాణశక్తిపై అవగాహన మరియు దానిని నియంత్రించడం అనేవి వ్యక్తులు ఆరోగ్యకరమైన, మరింత సంతృప్తికరమైన జీవితాలను గడపడానికి శక్తినిస్తాయి

మానవ స్థూల శరీరంలో ఉండే నరాలలో నిత్యము ఒకే వాయువు 10 విధాల కర్మలు చేస్తున్నాయి కాబట్టి దశవాయువులుగా గ్రహించబడ్డాయి. శిశువు మాతృ గర్భంలో ఉండగా ఏడవ నెలలో ఈ ప్రాణము (జీవశక్తి) ప్రవేశింపబడుతుంది. జీవశక్తి అంటే  అగ్నితత్వం కలది. అదే  జటరాగ్ని కూడా  అవుతుంది. శరీరంలో నడిచే దశ వాయువు వల్ల శరీరానికి జీవశక్తి అంటే చైతన్యము కలగజేసే ఒక ఎనర్జీ ఉంటుంది .  ఆ ఎనర్జీని ప్రాణము అంటారు.

 మానవుడు చనిపోయినాక శరీరం చల్లబడిపోతుంది, మానవుడు జీవించి ఉన్నంత కాలం 36 డిగ్రీల వేడి ఉంటుంది.  ఆ వేడిని ఏది కలగజేస్తుందో అదే ప్రాణం. జీవుడు తాను తిన్న ఆహారము... తాగిన నీరు... పీల్చిన గాలి  సారం నుంచి  శక్తి ఉద్భవిస్తుంది.   ఆ శక్తి శరీరాన్ని చైతన్య పరుస్తుంది. ఆ చైతన్యమే జీవశక్తి.. ఆ జీవ శక్తే ప్రాణమని  నిపుణులు చెబుతున్నారు. 

నిజంగా తేజస్సే ఉదానం అనే వాయువునుంచి ప్రాణం ఉద్భవించింది. తేజస్సు అంటే అగ్ని. అగ్నిలో వేడి వెలుగు రెండూ ఉంటాయి.  సూర్యుని తేజస్సులో ఉండేది ఉదానమే. ఎవరిలో యీ ఉదానము శాంతించి పోతుందో (వేడిమి తేజస్సు తగ్గి పోతాయో) అట్టివారు మనస్సు.. ఇంద్రియాలతో సహా మరియొక శరీరంలోకి వెళుతుంది.  అంటే ప్రాణం ఒక శరీరం నుంచి మరో శరీరం ద్వారా పునర్జన్మకు సిద్దమవుతుంది. 

పురాణాల ప్రకారం ఉదానం శాంతించటంతోనే చనిపోతారు. అప్పుడు వాక్కు మొదలైన ఇంద్రియాలన్నీ మనస్సులో లీనమై పోతాయి. ఆ మనస్సు ఈ శరీరాన్ని వదలి ఇంకొక శరీరాన్ని పొందటానికి పోతుంది.మరణ కాలంలో మానవునికి ఏ ఆలోచన ఉంటుందో ఆ ఆలోచనతో సహా అతడు (జీవి) ప్రాణమును పొందుతాడు. ఆ  ప్రాణమే అగ్నితో (ఉదాన వాయువుతో) కలిసి జీవాత్మగా ఏర్పడుతుంది.  

మానవుని ఆత్మ అయిదు కోశాలతో  నిర్మితమై ఉంటుంది.  1. అన్నమయ 2. ప్రాణమయ 3. మనోమయ 4. విజ్ఞానమయ 5. ఆనందమయ కోశాలు

) అన్నమయ  కోశం దీని ద్వారా స్థూల శరీరం నిర్మితమవుతుంది.   ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు మూడూ కలిసి సూక్ష్మశరీరాన్ని ఏర్పరుస్తాయి.ఇక ఆనందమయ కోశంతో.. కారణ శరీరం ఏర్పడుతుంది

జీవించి ఉండటమంటే ఆత్మ కారణ శరీరంలో బంధించబడి ఉంటుంది.ఆత్మ కారణ శరీరంలో  సూక్ష్మ శరీరం,  స్థూలశరీరం రెండూ కలిసి ఉంటాయి.  మరణిస్తే  స్థూలశరీరం నుండి సూక్ష్మకారణ శరీర కారకాలు రెండూ విడిపోతాయి. అప్పుడు  మరొక జన్మ కలగటానికి ఇట్లా వేరైపోయిన సూక్ష్మశరీరమే కారణమవుతుంది.   ప్రాణం లేదా జీవశక్తి  ఆధ్యాత్మిక శ్రేయస్సును కాపాడటంలో, శరీర వ్యవస్థలను..  శక్తులను సమన్వయం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

ఉదాన వాయువు కంఠంలో ఉంటుంది, ఇది వాక్కు, ఎదుగుదల మరియు స్వీయ వ్యక్తీకరణను నియంత్రిస్తుంది.  మన ఆలోచనలు  భావాలను తెలియజేస్తుంది.కాబట్టి మరణ సమయంలో ఏ మనోభావంతో ఉందో ఆ మనోభావంతోనే జీవాత్మ ప్రాణమయ కోశం వద్దకు వస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.