నేరాల దర్యాప్తులో ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలకం : డీజీపీ సీవీ ఆనంద్

నేరాల దర్యాప్తులో ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలకం : డీజీపీ సీవీ ఆనంద్
  •   కొత్తగా ఎంపికైన 57 మందికి నియామక పత్రాలు అందజేత

హైదరాబాద్, వెలుగు: నేరాల దర్యాప్తులో ఫోరెన్సిక్ సైన్స్ రిపోర్టులు కీలకమని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. నేర నిరూపణలో ఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌ సిబ్బంది పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. సోమవారం నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా 57 మంది ఫోరెన్సిక్ ఉద్యోగులకు నియామకపత్రాలను డీజీపీ అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న నేరాలకు అనుగుణంగా ఫోరెన్సిక్ సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక పరికరాలు, కెమికల్స్, ఇతర మెటీరియల్‌‌ను సమకూర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌ డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ పరిమిత సిబ్బందితోనే ఫోరెన్సిక్ ల్యాబ్‌‌ 80 శాతానికి పైగా కేసులను పరిష్కరిస్తోందన్నారు. దేశంలో అత్యధికంగా ఫోరెన్సిక్ నివేదికలను అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందని తెలిపారు. గతేడాది మొత్తం 18,647 కేసులను పరిష్కరించి 86 శాతం డిస్పోజల్‌‌ రేటు నమోదు చేసినట్లు వెల్లడించారు.