మున్సి పల్ ఎన్నికలకు పకడ్బందీ చర్యలు తీసుకోండి : డీజీపీ శివధర్ రెడ్డి

మున్సి పల్ ఎన్నికలకు పకడ్బందీ  చర్యలు తీసుకోండి : డీజీపీ శివధర్ రెడ్డి
  •     పోలీస్ అధికారులకు డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను డీజీపీ శివధర్‌‌రెడ్డి ఆదేశించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే, ద్వేష పూరిత ప్రసంగాలు చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 

మంగళవారం ఆయన పోలీస్ కమిషనర్లు , జిల్లాల ఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌ఓ)లతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ మాట్లాడుతూ.. ఈ నెల 11న పోలింగ్,  13 న కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.