V6 News

35 మంది ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా ప్రమోషన్.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక నిర్ణయం

35 మంది ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా ప్రమోషన్.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక నిర్ణయం

హైదరాబాద్ పోలీస్ శాఖలో చిరకాల నిరీక్షణకు తెరపడింది. పదోన్నతుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇన్స్పెక్టర్లకు శుభవార్త చెబుతూ తెలంగాణ డీజీపీ బి.శివధర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దీర్ఘకాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 35 మంది ఇన్స్పెక్టర్లకు డిఎస్పీలుగా పదోన్నతులు కల్పించామని తెలిపారు. డిజిపి కార్యాలయంలో గురువారం  పదోన్నతులు పొందిన 35 మంది డిఎస్పిలతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టు కేసులు, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ పదోన్నతుల ప్రక్రియను ఎట్టకేలకు పరిష్కరించామని వెల్లడించారు. అర్హులైన అధికారులకు సరైన సమయంలో గుర్తింపు దక్కడం సంతోషకరమని అన్నారు.  శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేష్, భగవత్, అడిషనల్ డిజిపి , పర్సనల్ డిఎస్ చౌహాన్, మల్టీ జోన్ వన్ ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి, రైల్వే ఐజి పి. రమేష్ నాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు