సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కొత్త మూవీ ‘ధర్మన్’పై అంచనాలు పెరుగుతున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత రజనీ-కమల్ కాంబోలో వస్తున్న మూవీ కావడం ఒక ఎత్తైతే.. సూపర్ స్టార్ క్రేజీ లుక్స్ పీక్స్ లెవల్లో నిలబెడుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ది ఓజీ స్వాగ్’ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రచ్చచేస్తుంది. ఈ నేపథ్యంలోనే మరింత కిక్కిచ్చే అప్డేట్ అందించింది చిత్రబృందం.
ది డెడ్లీ డాక్టర్ మొదలెట్టాడు..
రజనీకాంత్ మాస్ ప్లస్ క్లాస్ కలబోతతో వస్తున్న ‘ధర్మన్ – ది డెడ్లీ డాక్టర్’ అధికారికంగా షూటింగ్ మొదలెట్టింది. ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన కొత్త పోస్టర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. పోస్టర్‌లో డాక్టర్ కోటును చేతిలో పట్టుకుని, చుట్టూ తూటాల గుళికల మధ్య నిలబడ్డ రజనీకాంత్ పవర్‌ఫుల్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో న్యాయం కోసం పోరాడే, ఓ పవర్ ఫుల్ హంటింగ్ డాక్టర్ పాత్రలో తలైవా కనిపించనున్నట్లు ఫస్ట్ లుక్ &టైటిల్ తోనే స్పష్టమైంది.
ఈ క్రమంలోనే ‘ధర్మన్’ అనే టైటిల్‌కు తగ్గట్టుగానే యాక్షన్, క్రైమ్, ఎమోషన్, సోషల్ మెసేజ్.. ఇలా అన్నీ హంగులతో సినిమా రూపొందుతోందని మరింత క్లారిటీ వచ్చింది. ఇక ‘ధర్మన్’ షూటింగ్ ప్రారంభం కావడంతో మిగిలిన నటీనటులు, విడుదల తేదీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, రజనీకాంత్ మరోవైపు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జైలర్ 2' చిత్రంలో కూడా నటిస్తున్నారు.
Swag is his Signature#KettaPaiyanSir#Dharman Shoot Begins#SuperstarRajinikanth #KamalHaasan @rajinikanth @ikamalhaasan #Mahendran @Dir_Ashwath @anirudhofficial @anbariv @iYogiBabu @SimranbaggaOffc #RaashiKhanna @nikethbommi #KarthikRajkumar @PradeepERagav @kabilanchelliah… pic.twitter.com/C8k7C7yABr
— Raaj Kamal Films International (@RKFI) June 25, 2026
అశ్వత్ మారిముత్తు విజన్..
‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్‌కు వీరాభిమాని అయిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు తన విజన్‌తో తలైవాను కొత్త అవతారంలో చూపించేందుకు సిద్ధమయ్యాడు. ‘ధర్మన్’లో మాస్, ఎమోషన్, యాక్షన్‌ల సమ్మేళనంగా సూపర్ స్టార్‌ను ప్రజెంట్ చేయబోతున్నట్లు ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియోలు స్పష్టం చేస్తున్నాయి.
►ALSO READ | Idupu Kayitham: ఎందుకురా ఓర్వలేని తనం.. అర్థం కాకపోతే మూసుకోండి.. ‘ఇడుపు కాయితం’ ట్రోల్స్‌కు ఘంటా ఘాటు రిప్లై
అంతేకాకుండా దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ వృత్తిపరంగా కలుస్తుండటం ఈ ప్రాజెక్ట్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో సిమ్రాన్, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
