శ్రీలంక టూర్ కు ధవన్ కెప్టెన్

శ్రీలంక టూర్ కు  ధవన్ కెప్టెన్

ముంబై:  వచ్చే నెలలో శ్రీలంక టూర్​కు వెళ్లనున్న ఇండియా టీమ్‌‌‌‌కు ఏకంగా ఐదుగురు కొత్త క్రికెటర్లు ఎంపికయ్యారు. ఐపీఎల్‌‌‌‌లో సత్తాచాటిన యంగ్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌ దేవదత్‌‌‌‌ పడిక్కల్‌‌‌‌, రుతురాజ్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌, నితీశ్‌‌‌‌​ రాణాతో పాటు స్పిన్నర్​ కృష్ణప్ప గౌతమ్‌‌‌‌, యంగ్ పేసర్​ చేతన్‌‌‌‌ సకారియా తొలిసారి నేషనల్‌‌‌‌ టీమ్‌‌‌‌లోకి వచ్చారు.  టెస్టుల్లో ప్లేస్‌‌‌‌ కోల్పోయిన  పృథ్వీ షా వైట్‌‌‌‌ బాల్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో చాన్స్‌‌‌‌ దక్కించుకున్నాడు.  లంకతో మూడు వన్డేలు, 3 టీ20ల సిరీస్‌‌‌‌ల కోసం ఆలిండియా సీనియర్​ సెలెక్షన్‌‌‌‌ కమిటీ గురువారం 20 మందితో కూడిన టీమ్‌‌‌‌ను ప్రకటించింది. సీనియర్​ బ్యాట్స్‌‌‌‌మన్​ శిఖర్ ధవన్‌‌‌‌కు కెప్టెన్సీ అప్పగించిన కమిటీ భువనేశ్వర్​ కుమార్​ను వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా ఎంపిక చేసింది. వరుణ్‌‌‌‌ చక్రవర్తి, కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌, యజ్వేంద్ర చహల్, రాహుల్‌‌‌‌ చహర్‌‌‌‌, కృష్ణప్ప గౌతమ్‌‌‌‌ స్పిన్నర్ల కోటాలో ఎంపికయ్యారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జులై 13, 16, 18వ తేదీల్లో మూడు వన్డేలు, అదే నెల 21, 23, 25వ తేదీల్లో మూడు టీ20లు షెడ్యూల్‌‌‌‌ చేశారు. కోహ్లీ కెప్టెన్సీలోని మెయిన్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌ టూర్​లో ఉండగా, ఈ సెకండ్‌‌‌‌ స్ట్రింగ్‌‌‌‌ టీమ్‌‌‌‌కు  ఎన్‌‌‌‌సీఏ హెడ్‌‌‌‌ రాహుల్‌‌‌‌ద్రవిడ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా వ్యహరించే చాన్స్‌‌‌‌ ఉంది. 

ఇండియా టీమ్‌‌‌‌: ధవన్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), పృథ్వీ షా, పడిక్కల్‌‌‌‌, రుతురాజ్‌‌‌‌, సూర్యకుమార్​, మనీశ్‌‌‌‌ పాండే, హార్దిక్, నితీశ్‌‌‌‌​ రాణా, ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌, శాంసన్‌‌‌‌, చహల్‌‌‌‌, కృష్ణప్ప గౌతమ్‌‌‌‌, రాహుల్‌‌‌‌ చహర్​, క్రునాల్‌‌‌‌, కుల్దీప్‌‌‌‌, చక్రవర్తి, భువనేశ్వర్​(వైస్ కెప్టెన్‌‌‌‌), దీపక్‌‌‌‌ చహర్​, సైనీ, సకారియా.
నెట్‌‌‌‌ బౌలర్లు: ఇషాన్ పోరెల్‌‌‌‌, సందీప్‌‌‌‌ వారియర్, సాయి కిషోర్​, సిమ్రన్‌‌‌‌జీత్‌‌‌‌ సింగ్.