రాజమండ్రి: దీపికా అడ్రెస్స్ తో కాజల్ ఫోటో

రాజమండ్రి: దీపికా అడ్రెస్స్ తో కాజల్ ఫోటో

కాజల్ అగర్వాల్ ఎక్కడుంటుందో  ఎవరికన్నా తెలుసా?  వాళ్ల   ఇంటి అడ్రస్  తెలుసా.?  వాళ్ల నాన్న పేరన్నా తెలుసా? మొత్తానికి  వాళ్లు ఎక్కడుంటారో.. వాళ్ల నాన్న పేరేంటో అన్ని వివరాలు తెలిసిపోయాయి.  అవును కాజల్ అగర్వాల్ ఆంద్రప్రదేశ్ లో  ఉంటుంది. అస్సలు నమ్మ బుద్ధి కావడం లేదు కదా?  కానీ మీరు నమ్మి తీరాల్సిందే ఎందుకంటే  కాజల్ అగర్వాల్  ఏపీలో ఉంటున్నట్లు పక్కా ఆధారాలు కూడా ఉన్నాయి.  కావాలంటే ఒక్కసారి మీరు చూసుకోండి.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ఓటర్ల జాబితాలో హీరోయిన్  కాజల్ అగర్వాల్ కు ఓటు హక్కు ఉంది. కాకపోతే మరో  బాలీవుడ్  హీరోయిన్  దీపికా పదుకొనే పేరుతో  ఓటు హక్కు ఉంది. పేరు దీపీకా పదుకొనే , తండ్రి పేరు రమేశ్ కొండా, వయసు 22, ఇంటి నెంబర్ 3-5-22 అనే అడ్రస్ తో  ఉంది.  ఇదంతా చూసినొళ్లు అరే కాజల్ అగర్వాల్  ఏపీకి ఎప్పుడొచ్చింది. ఎప్పుడు ఇళ్లు కట్టుకుంది..ఓటు హక్కు ఎప్పుడు నమోదు చేసుకుందని అవాక్కవుతున్నారు.

ఇదంతా ఎన్నికల సంఘం వైఫల్యమేనంటున్నారు కొందరు. పొరపాటో ఏమో తెలియదు గానీ  ఇలాంటి వింతలు విచిత్రాలు చాలా చోట్ల జరుగుతున్నాయి.  ఉన్న ఓట్లు పోయి కొత్త ఓట్లు వస్తున్నాయి.  రాష్ట్రంతో సంబంధం లేకున్నా ఓటర్ లిస్ట్ లో దర్శనమిస్తున్నారు.

dheepika-padukone-vote-in-rajamundry-rural-voter-list-at-andhra-pradhesh