బాక్సాఫీస్ వద్ద ఏడు వారాలుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ.. థియేటర్లలో ఇంకా సత్తా చాటుతున్న బాలీవుడ్ సెన్సేషనల్ మూవీ 'ధురంధర్: ది రివెంజ్' (ధురంధర్ 2). స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈ మూవీని ఒక విజువల్ వండర్‌గా, ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో తెరకెక్కించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ .. ఇప్పటికే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1800 కోట్ల వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు ఓటీటీలో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఈ బ్లాక్ బస్టర్ ఓటీటీ రిలీజ్ పై ఫ్యాన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది.
డిజిటల్ రైట్స్ కోసం క్రేజీ ట్విస్ట్..
అయితే, ఈ సీక్వెల్ డిజిటల్ రైట్స్‌కు సంబంధించి ఒక క్రేజీ ట్విస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో స్టూడియోస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు గ్లోబల్ ఓటీటీ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ కూడా రంగంలోకి దిగింది. ఓవర్‌సీస్ మార్కెట్లలో మాత్రమే స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక భారతదేశంలో మాత్రం దీని రారాజు జియో హాట్‌స్టార్ మాత్రమే. ఇక్కడ సోలో స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్‌స్టార్ వద్దే పదిలంగా ఉన్నాయి.
స్ట్రీమింగ్ డేట్ ఇదే!
నెట్‌ఫ్లిక్స్ ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాను మే 14, 2026 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. కానీ, ఇండియాలో జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ డేట్‌పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ ఒక క్రేజీ అంచనాకు వచ్చారు. ఓవర్‌సీస్ నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ రోజే (మే 14న) జియో హాట్‌స్టార్ కూడా ఇండియాలో ఈ సినిమాను డిజిటల్ ప్రీమియర్ చేయక తప్పదని ఫ్యాన్స్ బెట్టింగులు కాస్తున్నారు. లేదంటే వ్యూయర్‌షిప్ ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫామ్స్ వైపు డైవర్ట్ అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఓటీటీ రికార్డులకు రెడీ..
థియేటర్లలో ఊచకోత కోసిన ఈ బ్లాక్‌బస్టర్, ఇప్పుడు ఓటీటీ రికార్డులను కూడా బద్దలు కొట్టడానికి రెడీ అవుతోంది. మరోవైపు, ఈ సినిమాకున్న క్రేజ్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే, దీని పార్ట్-1 'ధురంధర్' ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్-10 చార్ట్స్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు, మళ్లీ మళ్లీ చూడాలనుకునే వాళ్లు మే 14 కోసం వెయిట్ చేస్తున్నారు. అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్ లాంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ విజువల్ వండర్ డిజిటల్ ధునియాలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి .
