"కొండా ఫ్యామిలీ"పై ఆర్జీవీ ట్వీట్

"కొండా ఫ్యామిలీ"పై ఆర్జీవీ ట్వీట్

కాంట్రవర్శియల్ సినిమాలు తీస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్ ఉండే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా భిన్నంగానే ఉంటుంది. ఇష్టపడేవాళ్లకు హీరోలా కనిపించే వర్మ.. గిట్టని వాళ్లకు మాత్రం విలన్. దేవుడంటే నమ్మకం లేదని చెప్తూనే... అందుకు పూర్తి భిన్నమైన పనులు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇది ఆయనకు కొత్త కాదు. కొన్నిసార్లు ఆయన చెప్పింది మేధావులకు తప్ప మరెవరీ అర్థం కాదు. ఇదంతా ఇప్పుడెందుకు అంటే.. తాజాగా ఆయన చేసిన ట్వీట్ కారణం. కనకదుర్గమ్మ ఫొటోను షేర్ చేసిన ఆర్జీవీ.. తాజాగా కొండా ఫ్యామిలీతో కలిసి విజయవాడ  కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్లిన వీడియోను పోస్ట్ చేశారు. కొండా మూవీ నేపథ్యంలోనే ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆర్జీవీ తన భాషలో ఇలా చెప్పాడు. "కొండా ఫ్యామిలీ మూలాన ఇదీ నా పరిస్థితి" అనే క్యాప్షన్ ను జత చేసి పోస్ట్ చేసిన ట్వీట్ పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో పాటు కొండా ఫిల్మ్ టీం వికాస్ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తో లైవ్ ఇంటారక్షన్ ఉంటుందని.. దానికి ఎవరూ రావొద్దనే కామెంట్ కూడా జత చేశాడు ఆర్జీవీ.