OTT Drama: ఓటీటీలోకి సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామా.. రూ.6.5 కోట్ల బడ్జెట్..75 కోట్ల వసూళ్లు..

OTT Drama: ఓటీటీలోకి సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామా.. రూ.6.5 కోట్ల బడ్జెట్..75 కోట్ల వసూళ్లు..

సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘థాయ్ కిళవి’ (Thaai Kizhavi). ఈ ఏడాది కోలీవుడ్‌లో సర్ప్రైజ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దర్శకుడు శివకుమార్ మురుగేశన్ తెరకెక్కించిన ఈ కామెడీ-ఫ్యామిలీ డ్రామా, తక్కువ బడ్జెట్‌తో భారీ విజయాన్ని నమోదు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. హీరో శివ కార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రం కేవలం రూ.6.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఓటీటీ రిలీజ్

‘థాయ్ కిళవి’ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్ స్టార్ (JioHotstar)లో ఏప్రిల్ 10 నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు. ప్రస్తుతం తమిళ వెర్షన్ రిలీజ్‌ను అధికారికంగా ప్రకటించగా, ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్లు కూడా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

థియేట్రికల్ రన్ & రెస్పాన్స్

ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా, కేవలం కథ, భావోద్వేగాలు, సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టెడీగా కలెక్షన్లు సాధించింది. కేవలం రూ.6.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద రూ.75 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ లాభాలు అందించింది. మొత్తానికి సుమారు 50 రోజుల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కానుంది.

అరుదైన ఘట్టం:

సినిమా భారీ విజయాన్ని సాధించడంతో, నిర్మాత శివకార్తికేయన్ ఒక అరుదైన నిర్ణయం తీసుకున్నారు. హీరోయిన్ రాధికకు రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా కూడా అందించారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఒక సీనియర్ నటికి ఈ విధంగా ప్రాఫిట్ షేర్ ఇవ్వడం అరుదైన విషయం అని రాధిక స్వయంగా వెల్లడించారు.

మంచంపై ఉండి కూడా కేవలం కళ్లతో, హావభావాలతో రాధిక పండించిన నటన సినిమాకు ప్రాణం పోశాయి. మొత్తంగా, కంటెంట్ ఆధారంగా తెరకెక్కిన ‘థాయ్ కిళవి’ థియేటర్లలో సూపర్ హిట్ సాధించిన తర్వాత, ఇప్పుడు ఓటీటీలో కూడా మంచి స్పందన పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కథేంటంటే:

‘థాయ్ కిళవి’ కథ పావునుతాయ్ (రాధికా శరత్ కుమార్) అనే కఠిన స్వభావం కలిగిన వృద్ధురాలి చుట్టూ తిరుగుతుంది. వడ్డీ వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని కంట్రోల్‌లో ఉంచే ఆమెకు అకస్మాత్తుగా పక్షవాతం వస్తుంది. మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆమె, ఒక రహస్యాన్ని చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఇదే సమయంలో ఆమె దాచిన ‘160 తులాల బంగారం’ కోసం కుటుంబ సభ్యులు, ఒక పరాయి వ్యక్తి ఆసక్తి చూపిస్తారు. ఆ రహస్యం ఏమిటి? ఆ బంగారం ఎవరిది? అన్నదే కథలో ప్రధాన ట్విస్ట్.