కాలి వేళ్లతో గవర్నర్ బొమ్మ.. దివ్యాంగ యువతి ప్రతిభ

కాలి వేళ్లతో గవర్నర్ బొమ్మ.. దివ్యాంగ యువతి ప్రతిభ

హైదరాబాద్ సిటీ, వెలుగు: లోక్‌‌‌‌భవన్‌‌‌‌లోని సంస్కృతి కమ్యూనిటీ హాల్‌‌‌‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో దివ్యాంగ యువతి, జీహెచ్‌‌‌‌ఎంసీలో జూనియర్ అసిస్టెంట్‌‌‌‌గా పనిచేస్తున్న మూలె వైష్ణవి తన కళా ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. తన కాళ్ల వేళ్లతో గవర్నర్ చిత్రపటాన్ని గీసింది. ఆ చిత్రపటాన్ని స్వయంగా గవర్నర్‌‌‌‌కు అందించింది. గవర్నర్ దంపతులు ఆమెను ఘనంగా సత్కరించి జ్ఞాపికతో పాటు నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.