హైదరాబాద్, వెలుగు: డీటీహెచ్ఆపరేటర్డిష్ టీవీ దక్షిణాదిలో మరింత విస్తరించడంపై దృష్టి సారించినట్టు ప్రకటించింది. హైదరాబాద్‌లో మంగళవారం కంపెనీ సీఈఓ మనోజ్డోబాల్మీడియాతో మాట్లాడుతూ.. ప్రాంతీయ భాషా చానెల్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని, నెలకు కేవలం రూ.149 నుంచే ప్రారంభమయ్యే ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నామని తెలిపారు. ఇందులో వినోదం, సినిమాలు, క్రీడలతో కూడిన 225 కి పైగా చానళ్లు ఉంటాయని చెప్పారు.
తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 30 కి పైగా చానళ్లు, తమిళం కోసం 36 కి పైగా చానళ్లను ప్రసారం చేస్తున్నారు. కస్టమర్లు తమ ఇష్టప్రకారం ఈ ప్యాకేజీలను మార్చుకునే సదుపాయం ఉంది. రీచార్జ్ తాత్కాలికంగా ఆగిపోయినా క్రీడా ప్రసారాలు నిరంతరాయంగా చూసేందుకు స్పోర్ట్స్ ఆల్వేస్- ఆన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు.
