డిస్నీ చేతికి ఫాక్స్

డిస్నీ చేతికి ఫాక్స్

ఫాక్స్ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బిజినెస్‌ ను 71 బిలియన్ డాలర్లకు డిస్నీ చేజిక్కించుకుం ది. దీంతో సిండ్రెల్లా, దిసిమ్‌ ప్సన్స్ , స్టార్ వార్స్, డా.స్ట్రేంజ్ వంటి వన్నీ ఒకే గొడుగుకిందకు చేరాయి. ఈ ఏడాది తరువాత డిస్నీ తన స్ట్రీమింగ్ సర్వీస్ డిస్నీ ప్లస్‌ ను ప్రారంభించడానికి ఈ డీల్ దారిచూపనుంది. వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు కూడా దారితీయనుంది. ది సిమ్‌ ప్సన్స్ , ఎక్స్ మెన్ స్టూ డియోస్ కొనుగోలు ద్వారా మేజాన్, నెట్‌ ఫ్లిక్స్ వంటి టెక్నాలజీ కంపెనీలతో పోటీపడి ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోవాలని డిస్నీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడున్న స్ట్రీమింగ్ సర్వీసులతో పాటు మరో కొత్త స్ట్రీమింగ్ సర్వీస్‌ ను ఆదరించాలంటే డిస్నీ ప్రత్యేక టీవీ షోలు, సినిమాలు వంటి వాటిని తీసుకు రావాల్సి ఉంటుంది. ఫాక్స్ కు చెందిన ఫాక్స్‌ నెట్‌ వర్క్స్, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్లలో వస్తోన్న ప్రోగ్రామ్‌ లతో పాటుగా మార్వెల్స్ ఎక్స్ మెన్, డెడ్‌ పూల్  వంటి కార్యక్రమాలను కూడా డిస్నీ జోడించనుంది. ఫాక్స్ ప్రొడక్షన్స్ లో ది అమెరికన్స్, దిస్ ఈజ్ అజ్, మోడర్న్ ఫ్యామిలీ వంటి వి కూడా ఉన్నాయి. టీవీ షోలను, సినిమాలను ప్రారంభం నుండి చివరిదాకా డిస్నీ కంట్రోల్ చేసేం దుకు గాను ఈ డీల్ దోహదప డుతుంది. ప్రోగ్రామ్స్‌ను రూపొందించడం నుండి వాటిని టెలివిజన్ ఛానెల్స్‌ , సినిమా థీయెటర్లు, స్ట్రీమింగ్ సర్వీసులు, ఇతర ఎంటర్‌ టైన్‌ మెంట్ మా ర్గాలను పంపిణీ చేయడానికి  ఉపయోగపడుతుంది.కస్టమర్లు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ లో ఎక్కువగా ఇష్టపడే  ప్రోగ్రామ్‌ లతో పాటు వారికి సంబంధించిన ఇతర విలువైన సమాచారాన్ని డిస్నీ పొందవచ్చు.

డిస్నీ ప్లస్‌‌‌‌కే మొదటి ప్రాధాన్యం

డిస్నీ ప్లస్ తో పాటు ఇతర డైరెక్ట్ టు కస్టమర్ బిజినెస్‌ లు డిస్నీకి మొదటి ప్రాధాన్యమని డిస్నీసీఈవో బాబ్ ఐగెర్ తెలిపారు. ఇంటర్నెట్ సేవలు అందిస్తోన్న ఏటీ&టీ, కామ్‌ కాస్ట్‌‌‌‌లు తమ కస్టమర్ల  టర్నెట్ యాక్సెస్‌ ను నేరుగా నియంత్రిస్తున్న ప్పటికీ, అమేజాన్, యూట్యూబ్, నెట్‌ ఫ్లిక్స్‌ లకు పెరుగుతున్న ఆదరణ ఇంటర్నెట్ సేవలందిస్తో న్న కంపెనీలకు ఇబ్బం దికరంగా మారుతోంది. ఏటీ&టీ గతేడాది టైమ్ వార్నర్‌ సంస్థను 81 బిలియన్ డాలర్లకు చేజిక్కించుకుని తమ స్వంత స్ట్రీమింగ్ సర్వీస్ ‘వాచ్ టీవీ’ ని ప్రారంభించింది. టీబీఎస్, టీఎన్‌ టీ వంటి టైమ్ వార్నర్ ఛానెల్స్ తో పాటుగా ఇతర నెట్‌ వర్క్‌‌‌‌లకు నెలకు 15 డాలర్లకు వాచ్ టీవీ సేవలను అందిస్తోంది. డిస్నీ స్ట్రీమింగ్ సర్వీసులకు మరింత ఊపందించేందు కు గాను మార్వెల్స్ ఎక్స్ మెన్, అవెంజర్స్ భవిష్యత్ సినిమాల్లో మళ్లీ కలిసి దర్శనమివ్వవచ్చు.మార్వెల్ స్టూ డియోస్‌ ను డిస్నీ దక్కించు కున్నప్పటికీ ఎక్స్ మెన్ వంటి కొన్ని క్యారెక్టర్లకు ఫాక్స్ లైసెన్స్ పొందిం ది. ఇప్పటికే ఉన్న స్ట్రీమింగ్ సర్వీస్​లు లో కూడా డిస్నీ వాటాను కలిగి ఉంటుం ది. దీన్లో ఎక్కువగా జనరల్ ప్రోగ్రామ్‌ లను నడిపేందుకు ఆలోచిస్తున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్లీ షోలు, సినిమాల వంటి వి డిస్నీ ప్లస్‌ లో ఉంటాయి. డిస్నీ ప్లస్‌ కు ఎంత ధర చెల్లిం చాల్సి ఉంటుం దనేది ఇప్పటికి వెల్లడిం చలేదు. ఈ స్ట్రీమింగ్ సర్వీస్ డిస్నీ, పిక్సర్ , మార్వెల్, స్టార్ వార్స్, నేషనల్ జియోగ్రాఫిక్స్ వంటి ఐదు కేటగిరీల్లో ఉండనుంది.21 సెంచరీ ఫాక్స్ లో భాగమైన ఫాక్స్ గ్రూప్ ఈ డీల్‌‌‌‌లో భాగస్వామ్యం కాదు.