ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు

ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ4) లో రూ.11,672 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)  వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ. 9,853 కోట్లతో పోలిస్తే ఇది 18.5 శాతం ఎక్కువ. స్టాండ్ ఎలోన్ బేసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్యాంక్ నికర లాభం రూ.9,122 కోట్ల నుంచి 17.4 శాతం పెరిగి రూ.10,708 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 8.1 శాతం వృద్ధి చెంది రూ.19,0‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌93 కోట్లకు చేరుకుంది. 

క్యూ4 లో బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన లోన్లు 16.8 శాతం గ్రోత్ నమోదు చేశాయి. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4.40 శాతానికి మెరుగుపడింది. వడ్డీయేతర ఆదాయం (ట్రెజరీ ఆదాయం మినహా)  రూ.5,930 కోట్లుగా నమోదయ్యింది. బ్యాంక్ ప్రొవిజన్లు క్యూ4 లో రూ.718 కోట్లకు దిగొచ్చాయి.