వెల్​స్పన్ ​ఆదాయం రూ.261.67 కోట్లు

వెల్​స్పన్ ​ఆదాయం రూ.261.67 కోట్లు

హైదరాబాద్​, వెలుగు:  హోమ్ టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాండ్​ వెల్​స్పన్​ నాలుగో క్వార్టర్​ ఫలితాలను ప్రకటించింది.  ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్​లో కంపెనీకి​ రూ.261.67 కోట్ల ఆదాయం వచ్చింది.  2024 ఆర్థిక సంవత్సరంలో ఇది 19.6 శాతం పెరిగి రూ.982.51 కోట్లకు చేరింది.  తాజా క్వార్టర్​లో ఇబిటా వార్షికంగా 25 శాతం పెరిగి రూ.40 కోట్లకు ఎగిసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 73.3శాతం పెరిగి రూ.1,514.7 కోట్లకు చేరింది.  

తాజా క్వార్టర్​లో నికరలాభం ఏడాది ప్రాతిపదికన 16.4 శాతం పెరిగి రూ.146 కోట్లుగా నమోదయింది. 2024 ఆర్థిక సంవత్సరంలో వెల్​స్పన్​కు  రూ.681.1 కోట్ల నికరలాభం వచ్చింది.  తాజా క్వార్టర్​ ఆర్థిక సంవత్సరంలో దేశీయ వినియోగదారుల వ్యాపారం విలువ వార్షికంగా 12.2శాతం పెరిగి  రూ.138.2 కోట్లకు చేరింది. 2024 ఆర్థిక సంవత్సరంలో దీని విలువ  రూ.570.7 కోట్లు ఉంది. నికర అప్పు 31 మార్చి 2024 నాటికి రూ. 1,354.2 కోట్లు ఉంది. సంవత్సరం క్రితం రూ. 15,34.3 కోట్లు ఉంది.