ఆహార భద్రతే ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ లక్ష్యం : ప్రఖార్‌‌‌‌‌‌‌‌వర్మ

ఆహార భద్రతే ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ లక్ష్యం : ప్రఖార్‌‌‌‌‌‌‌‌వర్మ

కాజీపేట, వెలుగు : ఆహార భద్రతే లక్ష్యంగా ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ పనిచేస్తోందని ఆ సంస్థ డివిజనల్ మేనేజర్ ప్రఖార్‌‌‌‌‌‌‌‌వర్మ చెప్పారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. పేదలకు నాణ్యమైన ఆహారం అందించే ఉద్దేశంతో 1965లో ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు పోర్టిఫైడ్‌‌‌‌‌‌‌‌ రైస్‌‌‌‌‌‌‌‌ను అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకాల కోసం సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది ఆగస్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి ఈ నెల వరకు 99 గూడ్స్ వ్యాగన్ల ద్వారా బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు రవాణా చేసినట్లు చెప్పారు. డిపో మేనేజర్లు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, దివ్య, జగ్గునాయక్, శ్యాంప్రసాద్, రాంచంద్రయ్య, రవీంద్ర, డిప్లనాయక్‌‌‌‌‌‌‌‌, వంశీ కృష్ణ, సుప్రియ, శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.