సదరం శిబిరాలకు దరఖాస్తుల ఆహ్వానం.. మల్కాజిగిరి ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య పరీక్షలు

సదరం శిబిరాలకు దరఖాస్తుల ఆహ్వానం..    మల్కాజిగిరి ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య పరీక్షలు

మల్కాజిగిరి, వెలుగు :  దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు, యూడీఐడీ కార్డుల జారీ కోసం జూన్ లో మల్కాజిగిరి ప్రభుత్వ దవాఖానలో ప్రత్యేక క్యాంప్​నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. జూన్ 2 నుంచి 29వ తేదీ వరకు పది రోజులపాటు ఈ శిబిరాలు నిర్వహించనున్నారు. 

వినికిడి లోపం, ఎముకలు-, కీళ్ల వైకల్యం, దృష్టి లోపం, మానసిక వైకల్యం, మానసిక అనారోగ్యం వంటి సమస్యలతో బాధపడుతున్న వారి కోసం 800 స్లాట్లు అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. అభ్యర్థులు ముందుగా సదరం-యూడీఐడీ పోర్టల్‌‌లో నమోదు చేసుకుని, అవసరమైన హెల్త్​రిపోర్ట్స్​, ఆధార్ కార్డు, పాస్‌‌పోర్టు సైజు ఫొటోలతో క్యాంప్​కు రావాలన్నారు వైకల్యానికి సంబంధించిన హెల్త్​సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి క్యాంప్​ఉంటుందన్నారు.