- ఎంపీ డీకే అరుణ
న్యూఢిల్లీ, వెలుగు: మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ ప్రధాని మోదీకి దక్కుతుందన్న అక్కసు తోనే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తు న్నాయని ఎంపీ డీకే.అరుణ విమర్శించారు. డీలిమిటేషన్–2026, మహిళా రిజర్వేషన్ బిల్లులపై శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. మహిళలకు రాజకీయాల్లో సమాన హక్కుల గురించి 1928లో మోతీలాల్ నెహ్రూనే తొలిసారి మాట్లాడారని గురువారం సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ చెప్పడంపై అభ్యంతరం తెలిపారు.
‘ప్రియాంకా జీ.. మీరు చరిత్ర తెలుసుకోవాలి. 1928కి మూడేండ్ల ముందే.. 1925లోనే మహాత్మా గాంధీ మహిళ ల హక్కులగురించి మాట్లాడారు. ఉప్పు సత్యాగ్రహంలో 70 వేల మంది మహిళలు పాల్గొన్నారు. ఈ విషయం మీకు తెలియదా?’ అని ప్రశ్నించారు.

