- మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు డీఎంఈ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జనరల్ ట్రాన్స్‌ఫర్లకు సంబంధించి సోమవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) సర్క్యులర్ జారీ చేసింది. ట్యూటర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియను స్పీడప్ చేయాలని అన్ని మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశించింది. జనవరి 1, 2026 నాటికి ఒకేచోట మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు బదిలీ కోరుకునేందుకు అర్హులు. డిసెంబర్ 31, 2025 నాటికి ఒకే స్టేషన్లో నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు.
వీరితో పాటు మే 31, 2027 లోపు రిటైర్ అయ్యే ఉద్యోగుల సమాచారాన్ని ప్రత్యేక ఫార్మాట్లో పంపాలని డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ ఆదేశించారు. ఏప్రిల్ 28 సాయంత్రం 5 గంటల్లోపు సాఫ్ట్ కాపీలను ఈమెయిల్ చేయాలని, హార్డ్ కాపీలను ఏప్రిల్ 29 మధ్యాహ్నం 12 గంటల కల్లా డీఎంఈకు అందజేయాలని డెడ్ లైన్ విధించారు.

