V6 News

తొర్రూరులో విషాద ఘటన.. భార్యపై అనుమానంతో పిల్లలను చంపేసి.. చచ్చిపోయాడు !

తొర్రూరులో విషాద ఘటన.. భార్యపై అనుమానంతో పిల్లలను చంపేసి.. చచ్చిపోయాడు !

వరంగల్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలకు ఉరి వేసి, ఆ పిల్లల తండ్రి ఉరివేసుకుని చనిపోయిన ఘటన విషాదం నింపింది. మృతులు అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుమ్ షావలి (35).. ఇద్దరు పిల్లలు విలష్, (05) వికేష్ (03)గా పోలీసులు గుర్తించారు.

భార్యపై అనుమానంతో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇలా రకరకాల కారణాలతో పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుని చనిపోతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. 

రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోవడం, జీవితంపై విరక్తి చెంది ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను చంపి, తానూ ఆత్మహత్య చేసుకుంది. సరిగ్గా నెల క్రితం.. మార్చి 28న సంగారెడ్డి కంది మండలం జుల్కల్‌‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. జుల్కల్‌‌ గ్రామానికి చెందిన ప్రవీణ్‌‌తో మక్త అల్లూరుకు చెందిన మమత(28)కు 2017లో వివాహమైంది. వీరికి మణికంఠ (3), ప్రణయశ్రీ(2) పిల్లలు ఉన్నారు.

ALSO READ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం రైట్ హ్యాండ్ అరెస్ట్..

జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్‌‌ చనిపోయాడు. దీంతో మమత జుల్కల్‌‌ గ్రామంలోనే తన ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు, మేనత్తతో కలిసి ఉంటోంది. భర్త చనిపోవడంతో మానసికంగా కుంగిపోయిన మమత జీవితంపై విరక్తి చెంది శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని టైంలో తన పిల్లలు మణికంఠ, ప్రణయశ్రీ గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత ఉరి వేసుకొని తానూ ఆత్మహత్య చేసుకుంది.