V6 News

'పెద్ది' సెట్స్‌లో మెగా జాతర.. శృతి హాసన్‌తో చరణ్ మాస్ స్టెప్పులు.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

'పెద్ది' సెట్స్‌లో మెగా జాతర.. శృతి హాసన్‌తో చరణ్ మాస్ స్టెప్పులు.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది'. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే అంచనాలు భారీగాస్థాయిలో నెలకొన్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. కేవలం ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ మినహా మిగిలిన చిత్రీకరణ దాదాపు పూర్తి చేసుకుంది.

మాస్ సాంగ్ షూటింగ్

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించి ఒక భారీ ఐటమ్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం టాలీవుడ్ సీనియర్ బ్యూటీ శృతి హాసన్ రంగంలోకి దిగింది. 'ఎవడు' సినిమా తర్వాత చరణ్, శృతి మళ్లీ కలిసి నటిస్తుండటంతో అభిమానుల్లో జోష్ పెరిగింది. ఈ సాంగ్‌ను టాలీవుడ్ సెన్సేషనల్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజ్ చేస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అదిరిపోయే మాస్ బీట్ అందించినట్లు తెలుస్తోంది.

శృతి హాసన్ భారీ రెమ్యునరేషన్!

ఈ ఒక్క పాట కోసం శృతి హాసన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్ అయింది. కేవలం ఐదు రోజుల షూటింగ్ కోసం ఆమె దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే, ఒక ఐటమ్ సాంగ్ కోసం ఇంత భారీ మొత్తం అందుకోవడం టాలీవుడ్‌లో సరికొత్త రికార్డుగా మారుతుంది.

లీక్డ్ వీడియోతో పెరిగిన హైప్

షూటింగ్ స్పాట్ నుంచి శృతి హాసన్, రామ్ చరణ్ మాస్ స్టెప్పులతో కూడిన ఒక వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ అవుతోంది. ఇందులో చరణ్ తనదైన గ్రేస్‌తో ఎనర్జిటిక్ డ్యాన్స్ చేస్తుంటే, శృతి అతనికి ధీటుగా స్టెప్పులు వేస్తోంది. ఏప్రిల్ 30 నాటికి ఈ పాట చిత్రీకరణ పూర్తి కానుంది.

రిలీజ్ ఎప్పుడంటే?

ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ లెజెండ్ శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్ చరణ్ కేవలం స్పోర్ట్స్ మ్యాన్ గానే కాకుండా, కుస్తీ యోధుడిగా కూడా కనిపిస్తారని టాక్. మొదట ఏప్రిల్ 30న విడుదల చేయాలనుకున్నా, లేటస్ట్ గా జూన్ 25న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్‌లో ‘రంగస్థలం’ తర్వాత మరో రా అండ్ రస్టిక్ మూవీగా ‘పెద్ది’ నిలుస్తుందని  సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సమ్మర్ హాలిడేస్ ముగిసేలోపు మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేందుకు బుచ్చిబాబు సనా సర్వం సిద్ధం చేస్తున్నారు..