బోర్డింగ్​ పాసుల కోసం అదన డబ్బులు తీసుకోవద్దు

బోర్డింగ్​ పాసుల కోసం అదన డబ్బులు తీసుకోవద్దు

న్యూఢిల్లీ: చెక్​ఇన్​ కౌంటర్ల వద్ద బోర్డింగ్​ పాసుల జారీ చేసే  టైంలో ప్యాసింజర్ల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయవద్దని ఎయిర్​లైన్స్ సంస్థలకు ఏవియేషన్​ మినిస్ట్రీ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఇండిగో, స్పైస్​ జెట్​తో పాటు గో ఫస్ట్​ ఎయిర్​లైన్స్​ సంస్థలు బోర్డింగ్​ పాస్​లు కావాలనుకునే ప్యాసింజర్స్​ నుంచి అదనంగా రూ.200 వసూలు చేస్తున్నాయని తెలిపింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇది ఎయిర్​క్రాఫ్ట్​ రూల్స్​కు విరుద్ధమని ఏవియేషన్​ మినిస్ట్రీ స్పష్టం చేసింది. బోర్డింగ్​పాస్​ విషయంలో ఎయిర్​లైన్స్​ సంస్థలు ఎక్స్​ట్రా డబ్బులు వసూలు చేయవద్దని 1937, ఎయిర్​క్రాఫ్ట్​ రూల్స్​ప్రొవిజన్స్​ తెలియజేస్తోందని గుర్తు చేసింది. ఇక నుంచి  ఎయిర్​పోర్టు చెక్​ ఇన్​ కౌంటర్స్​ వద్ద ఏ సంస్థ కూడా బోర్డింగ్​ పాసుల కోసం అదనంగా డబ్బులు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులందరూ వెబ్​చెక్​ ఇన్​ చేసుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించింది. గతంలో కూడా దీనిపై స్పష్టమైన గైడ్​లైన్స్​ ఇచ్చామని గుర్తు చేసింది. బోర్డింగ్​ పాసులకు ఎక్స్​ట్రా ఫీజు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని చెప్పింది.