Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌..ధర ఎంతంటే?

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌..ధర ఎంతంటే?

టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్ (Allu Aravind) ఒకరు. ఆయనకు సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన..స్టార్ స్టేటస్ ఉంది. భిన్నమైన కాన్సెప్ట్స్ తో తాను నిర్మించే సినిమాలు ఎప్పుడు తన అభిరుచిని తెలుపుతూ ఉంటాయి.కేవలం సినిమాలే కాకుండా అంతకుమించిన వ్యక్తిత్వం కూడా ఆయనకు ఉంది.ఇలా ప్రతి విషయంలో అందరి కంటే భిన్నంగా ఉండే అల్లు అరవింద్ ప్రతిదీ లగ్జరీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు.

అసలు విషయానికి వస్తే..అల్లు అరవింద్ తాజాగా ఓ ఖరీదైన ఎలక్ట్రిక్‌ కారు కొన్నాడు. బీఎమ్‌డబ్ల్యూ ఐ7 బ్రాండ్‌ను తన గ్యారేజీకి తీసుకొచ్చాడు అల్లు అరవింద్. కారు లుక్ చాలా షైనింగ్ గా ఉంది. చూడటానికి చాలా రిచ్ గా కనిపిస్తూనే అందంగా కూడా ఉంది. అయితే ఈ కారుకి అత్యాధునిక టెక్నాలజీ ఉండేలా చాలా వెరైటీస్ ఉన్నాయట.

ఈ ఎలక్ట్రిక్‌ కారు ధర సుమారు రెండున్నర కోట్ల పైనే ఉన్నట్లు తెలుస్తోంది.ఆ కారును స‌ద‌రు షో రూం నిర్వాహ‌కులు ఇటీవ‌లే అల్లు అర‌వింద్ ఇంటికి హోం డెలీవ‌రీ చేయ‌గా అర‌వింద్ త‌న భార్య‌ను అందులో కూర్చోబెట్టుకుని కారు న‌డిపారు.

ఇకపోతే అల్లు అరవింద్‌ గ్యారేజిలో చాలా రకాల కార్లు కూడా ఉన్నాయి. ఇక ఈ ఎలక్ట్రిక్‌ కారు చేరడంతో ప్లస్ 1 చేరినట్లు అయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

ఇకపోతే ప్రస్తుతం అల్లు అరవింద్ స్టార్ హీరోల సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇక తన కుమారుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆగస్టు 15 గ్రాండ్గా రిలీజ్ కానుంది.