హెలికాఫ్టర్లో బోర్లా పడిన సీఎం మమత

హెలికాఫ్టర్లో బోర్లా పడిన సీఎం మమత

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  హెలికాప్టర్‌లో వెళ్తుండగా గాయపడ్డారు. దుర్గాపూర్‌లో హెలికాప్టర్‌లో ఎక్కిన తర్వాత సీటులో కూర్చుటుండగా  బ్యాలెన్స్ తప్పి జారి కింద పడిపోయారు. వెంటనే ఆమెకు భద్రతా సిబ్బంది సహాయం చేసారు. ఈ ప్రమాదంలో ఆమెకు చిన్న గాయాలయ్యాయి.  అనంతరం ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించింది.  సీఎం మమతా బెనర్జీ పెనుప్రమాదం నుంచి బయటపడ్డారని ఆమెక  స్వల్ప గాయాలయ్యాయని అధికారిక వర్గాలు తెలిపాయి. 

గత ఆరు వారాల్లో మమతా బెనర్జీ గాయపడడం ఇది రెండోసారి కావడం గమనార్హం. మార్చి 14న 69 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి కోల్‌కతాలోని కాళీఘాట్ నివాసంలో పడిపోవడంతో ఆమె నుదిటిపై తీవ్రమైన గాయం అయింది. అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.  అంతకు ముందు 2023 జూన్‌లోనూ దీదీకి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. వాతావరణం అనుకూలంగా లేని కారణంగా హెలికాప్టర్‌ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అది ల్యాండ్ అయిన సమయంలోనే ఆమె కాలికి గాయమైంది.

Also Read:నోటాకు మెజారిటీ వస్తే ఎన్నికను రద్దు చేయాలి