
ప్రముఖ బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్(Guru Charan singh) కనిపించకుండా పోయారు. దాదాపు నాలుగు రోజులుగా ఆయన ఆచూకీ తెలియలేదని కుటుంబసభ్యులు తెలిపారు. ఈమేరకు గురు చరణ్ సింగ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 50 ఏళ్ల గురుచరణ్ సింగ్ మిస్సింగ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ముంబై వెల్లడం కోసం గురుచరణ్ సోమవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లాడట. కానీ, ఆయన ముంబై చేరుకోలేదని, ఇంటికి కూడా తిరిగి రాలేదని తెలిపారు. ఇక గురుచరణ్ ఫోన్ కు ట్రై చేయగా అది కలవడం లేదని, గత నాలుగు రోజులుగా అతడి జాడ తెలియరాలేదని, ప్రస్తుతం గురుచరణ్ మానసిక పరిస్థితి కూడా సరిగానే ఉందని, అందుకే తాము ఆందోళన చెందుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.