తిరుపతి ఆటో నగర్‎లో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో జనం పరుగులు

తిరుపతి ఆటో నగర్‎లో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో జనం పరుగులు

తిరుపతి ఆటోనగర్‎లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం (మార్చి 17) ఓ వేస్టేజ్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లోనే పక్క షాపులకు వ్యాపించాయి. రెండు షాపులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో స్థానికులు బెంబెలేత్తిపోయారు. 

భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్ల సహయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులో తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

ఈ ప్రమాదానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు.. మంటల్లో షాపులు పూర్తిగా కాలిపోవడంతో యాజమానులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 

►ALSO READ | చిత్తూరు జిల్లాలో సైకో వీరంగం.. పోలీస్ జీప్ దొంగలించి.. చివరికి చెరువులో దాక్కొని...