బషీర్‌బాగ్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారుల గుర్తిం పు అంశంలో చర్చల పేరుతో కాలయాపన చేయొద్దని, హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య కార్యాచరణ సమితి నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజమైన ఉద్యమకారులకే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో సమితి చీఫ్ కన్వీనర్ సుల్తాన్ యాదగిరి, కన్వీనర్ తుమ్మల ప్రపుల్ రామ్‌రెడ్డి మాట్లాడారు.
రాష్ట్రంలోని 12 ప్రధాన తెలంగాణ ఉద్యమకారుల కమిటీలను ఏకతాటి పైకి తీసుకొచ్చి నూతన తెలంగాణ ఉద్యమకారుల ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్ ఇవ్వాలని, రూ.కోటి బీమా సౌకర్యం కల్పించాలని, తెలంగాణ ఉద్యమ స్మృతి వనం ఏర్పాటు చేయాలని కోరారు.
