బ్రీతింగ్ ఎక్స‌ర్ సైజ్ లు చేస్తున్నారా..?

బ్రీతింగ్ ఎక్స‌ర్ సైజ్ లు చేస్తున్నారా..?

కోవిడ్ ప్రభావం ఎక్కువగా పడేది ఊపిరితిత్తుల మీదే అని అందరికీ తెలుసు. అందుకే ఈ టైంలో అన్నింటికంటే ఊపిరితిత్తులనే ఎక్కువ హెల్దీగా ఉంచుకోవాలి. దానికోసం రోజువారీ వ్యాయామాల్లో కొన్ని బ్రీతింగ్ వ్యాయామాలను కూడా కలుపుకుని చేస్తే లంగ్స్‌‌‌‌‌‌‌‌ను మరింత హెల్దీగా ఉంచుకోవచ్చు.

బ్రీతింగ్ ఎక్స‌ర్ సైజ్ రిగ్గా ఉంటే కంటినిండా నిద్ర పడుతుంది. అలాగే యాంగ్జైటీ లాంటి సమస్యల్ని దూరం పెట్టొచ్చు. పైగా బ్రీతింగ్‌‌‌‌‌‌‌‌ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌లు చేయడం చాలా ఈజీ. వీటికి పట్టే సమయం కూడా తక్కువే. ఈ బ్రీతింగ్ వ్యాయామాల్లో చాలా రకాలున్నాయి. వాటిలో ఏవైనా రెండింటిని రోజూ ప్రాక్టీస్ చేయడం వల్ల చాలావరకూ బ్రీతింగ్ ఇష్యూస్‌ను తగ్గించుకోవచ్చు. ఈజీగా ఉండే కొన్ని బ్రీతింగ్ వ్యాయామాలు ఇవి.

నదీ శోధన ప్రాణాయామం

ఆల్టర్నేటివ్ నాజల్ బ్రీతింగ్ అనే ఈ ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తులతో పాటు శరీరంలోని కండరాలకు కూడా శక్తి లభిస్తుంది. ముందుగా పద్మాసనంలో కూర్చుని శ్వాసపై ఫోకస్ ఉంచాలి. కాసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత కుడి లేదా ఎడమ చేయి చూపుడు వేలు, బొటనవేలుతో ముక్కును పట్టుకోవాలి. ఒక వేలి ద్వారా ముక్కు రంధ్రాన్ని మూసి రెండో రంధ్రం ద్వారా గాలి పీల్చి, వదలాలి. తర్వాత రెండో వేలితో మళ్లీ ఇలాగే రిపీట్ చేయాలి. ముందుగా తీసుకున్న శ్వాసను కాసేపు అలాగే ఉంచి పొట్టను బిగపట్టాలి. తరువాత నెమ్మదిగా శ్వాసను వదలాలి. ఇలా చేయడం వల్ల ఊపిరి తిత్తులు హెల్దీగా మారతాయి.

భుజంగాసనం

దీన్నే కోబ్రా పోజ్ అని కూడా అంటారు. ముందుగా బోర్లా పడుకుని, చేతులను ఛాతి దగ్గర ఉంచాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నడుము భాగాన్ని వీలైనంత వరకూ పైకి లేపి, వెనక్కి వంచాలి. నార్మల్‌‌‌‌‌‌‌‌గా శ్వాస తీసుకుంటూ ఆ పోజ్‌‌‌‌‌‌‌‌లో 20 సెకన్లు ఉండాలి. ఆ తర్వాత శ్వాస వదులుతూ నెమ్మదిగా ఛాతి, తల నేలకు ఆనించి రిలాక్స్ అవ్వాలి. ఈ వ్యాయామం వల్ల ఛాతి కండరాలు, వెన్ను బలంగా మారతాయి. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.

చెస్ట్, రిబ్ బ్రీతింగ్‌‌‌‌‌‌‌‌

రిబ్ బ్రీతింగ్ చేయాలంటే.. ముందుగా నిటారుగా కూర్చొని, రెండు చేతుల‌‌‌‌‌‌‌‌ను ఊపిరితిత్తుల కింద ఉంచాలి. శ్వాస తీసుకునేట‌‌‌‌‌‌‌‌ప్పుడు చేతులను మెల్లగా లోపలికి ప్రెస్ చేయాలి. తర్వాత రిలాక్స్డ్‌‌‌‌‌‌‌‌గా శ్వాస వ‌‌‌‌‌‌‌‌దలాలి.
చెస్ట్ బ్రీతింగ్‌‌‌‌‌‌‌‌లో శ్వాస తీసుకునేట‌‌‌‌‌‌‌‌ప్పుడు రెండు భుజాల‌‌‌‌‌‌‌‌ను ఒకేసారి పైకి లేపి, గాలిని వ‌‌‌‌‌‌‌‌దులుతూ కింద‌‌‌‌‌‌‌‌కు దింపాలి. ఇలా రోజుకి ఐదు సార్లు చేస్తే మంచిది. చెస్ట్, రిబ్ బ్రీతింగ్ వల్ల ఊపిరితిత్తులు మెరుగ్గా ప‌‌‌‌‌‌‌‌నిచేస్తాయి.

డ‌‌‌‌‌‌‌‌యాఫ్రేం బ్రీతింగ్‌‌‌‌‌‌‌‌

డయాఫ్రేం బ్రీతింగ్‌‌‌‌‌‌‌‌ను బెల్లీ బ్రీతింగ్ అని కూడా అంటారు. ఇది పొట్టతో శ్వాస తీసుకునే విధానం. ముందుగా నిటారుగా కూర్చుని శ్వాస తీసుకుంటూ.. మెల్లగా పొట్టను నింపాలి. తర్వాత బ‌‌‌‌‌‌‌‌లంగా గాలిని బ‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌కు వ‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌లాలి. దీంతో పొట్ట ఒక్కసారిగా లోప‌‌‌‌‌‌‌‌లికి వెళ్తుంది. ఇలా శ్వాసతో పాటు పొట్ట కూడా లోపలికి, బయటకి కదలాలి. ఇలా చేయ‌‌‌‌‌‌‌‌డం వ‌‌‌‌‌‌‌‌ల్ల ఊపిరితిత్తుల పని తీరు మెరుగుపడుతుంది. డయాఫ్రం బ్రీతింగ్ సరిగ్గా చేయకపోతే.. క‌‌‌‌‌‌‌‌డుపు నొప్పి రావొచ్చు. అందుకే మెల్లగా మొదలుపెట్టి రోజుకి నిముషం చొప్పున చేస్తూ టెక్నిక్‌‌‌‌‌‌‌‌ను అలవాటు చేసుకోవాలి.

478 టెక్నిక్

శ్వాసకు సంబంధించిన ఏ వ్యాయామాన్నైనా నిటారుగా కూర్చుని చేయాలి. 478 టెక్నిక్‌‌‌‌‌‌‌‌లో ముందుగా నోటి ద్వారా గాలిని బయటకు వదలాలి. తర్వాత నోటిని మూసి, ముక్కు ద్వారా గాలిని లోపలికి పీల్చుకుంటూ నాలుగంకెలు లెక్కపెట్టాలి. తర్వాత ఏడంకెలు లెక్కపెట్టేవరకూ ఆ ఊపిరిని బిగబట్టి ఉంచాలి. ఆ తర్వాత ఎనిమిదంకెలు లెక్కపెట్టే వరకూ గాలిని నోటి ద్వారా బయటకు వదులుతుండాలి. ఇదీ 478 టెక్నిక్. ఇలా ఈ వ్యాయామాన్ని రోజుకు మూడు సార్లు చేస్తే మంచిది.