ప్రజా కాంగ్రెస్ గో సేవ విభాగం ..జాతీయ అధ్యక్షుడిగా సంజయ్ కుమార్

ప్రజా కాంగ్రెస్ గో సేవ విభాగం ..జాతీయ అధ్యక్షుడిగా సంజయ్ కుమార్

పద్మారావునగర్, వెలుగు: ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ గో సేవ విభాగం జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ విడియాల సంజయ్ కుమార్‌‌‌‌ నియమితులయ్యారు. ఈ నియామక పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించడమే తమ అంతిమ లక్ష్యమన్నారు. గో సేవ విభాగం జాతీయ ఉపాధ్యక్షుడిగా సుదర్శన్, జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ పాటిల్​ను నియమించినట్లు తెలిపారు.