V6 News

ప్రాణాంతక వ్యాధి నుంచి గర్భిణికి సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు పునర్జన్మ

ప్రాణాంతక వ్యాధి నుంచి గర్భిణికి సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు  పునర్జన్మ

పద్మారావునగర్, వెలుగు: అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన ‘యుగ్లైసెమిక్ కీటోఆసిడోసిస్’ అనే మెటబాలిక్ సమస్యతో పోరాడుతున్న ఓ గర్భిణికి సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు పునర్జన్మ ప్రసాదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం వెల్లడించారు. శ్వాసకోశ వైఫల్యంతో అత్యంత విషమ స్థితిలో హాస్పిటల్లో చేరిన ఆమెకు రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా ఉండటంతో వ్యాధిని గుర్తించడం సవాలుగా మారింది. దీనికి తోడు అప్పటికే గర్భంలోని శిశువు మరణించడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. 

అయినప్పటికీ గైనకాలజిస్ట్ డా. తాజమ్ముల్ సమ్రీన్, ఇంటెన్సివ్ కేర్ నిపుణులు డా. బాలసుబ్రహ్మణ్యం, ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు డా. ప్రదీప్ కుమార్ మిశ్రా బృందం సమన్వయంతో అత్యాధునిక క్రిటికల్ కేర్ చికిత్స అందించి ఆమెను మృత్యుంజయురాలిగా నిలిపారు. సకాలంలో సరైన నిర్ధారణ చేయడం వల్లే ఆమె కోలుకుందని, గర్భిణులు, ప్రత్యేక మందులు వాడేవారు ఇలాంటి అరుదైన లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచించారు.