యాదాద్రి, వెలుగు : కుక్క దాడిలో కన్ను కోల్పోయిన ప్రియాన్స్కు ప్రభుత్వమే ట్రీట్మెంట్ చేయిస్తోందని యాదాద్రి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి తెలిపారు. కోలుకునే వరకూ పూర్తి స్థాయిలో ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న ప్రియాన్స్ను ఆయన పరామర్శించారు.
హెల్త్ కండీషన్‌ను అడిగి తెలుసుకున్నారు. కుడి కన్ను పూర్తిగా బయటకు వచ్చినందున ప్రియాన్స్కు చూపు వచ్చే అవకాశం లేదని, కృత్రిమ కన్ను అమరుస్తామని డాక్టర్లు చెప్పారని ఎమ్మెల్యే కుంభం తెలిపారు. ప్రియాన్స్ తలిదండ్రులకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. కాగా ప్రియాన్స్ హెల్త్ కండీషన్‌ను ఢిల్లీలో ఉన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.
